: తాత్కాలిక ఎయిర్ పోర్టుగా చెన్నైలో నేవల్ ఎయిర్ స్టేషన్
భారీ వర్షాలతో చెన్నై విమానాశ్రయాన్ని మూసివేయడంతో తాత్కాలిక ఎయిర్ పోర్టును ఏర్పాటు చేశారు. నగరం సమీపంలోని అరక్కోణం ప్రాంతంలో ఉన్న నేవల్ ఎయిర్ స్టేషన్ ను ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ హైదరాబాద్ నుంచి ఏ320 విమానంలో కొందరు ప్రయాణికులను అరక్కోణంలోని ఎయిర్ స్టేషన్ కి తరలించారు. ఇక రేపు ఇక్కడి నుంచే సాధారణ విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్టు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు చెన్నై విమానాశ్రయాన్ని ఈ నెల 6 వరకు మూసివేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.