: టాస్ నెగ్గిన కోహ్లీ... నాలుగో టెస్టులోనూ తిప్పేస్తాడా?


ఫ్రీడమ్ సిరీస్ లో భాగంగా చివరి మ్యాచ్ అయిన నాలుగో టెస్టు కొద్దిసేపటి క్రితం ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకుని పర్యాటక జట్టును ఫీల్డింగ్ కు ఆహ్వానించాడు. భారత ఓపెనర్లు మురళీ విజయ్, శిఖర్ ధావన్ లు టీమిండియా తొలి ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. నాలుగు టెస్టుల సిరీస్ లో ఇప్పటికే మూడు టెస్టులు ముగిశాయి. టీమిండియా 2-0 ఆధిక్యంతో పైచేయి సాధించింది. ప్రధానంగా స్పిన్ బౌలింగ్ ను ఆయుధంగా ప్రయోగించిన కోహ్లీ, వరుస విజయాలను నమోదు చేశారు. నేటి మ్యాచ్ తన సొంత మైదానంలో జరుగుతోంది. ఈ మ్యాచ్ లోనూ అతడు స్పిన్ తోనే సఫారీలను ముప్పు తిప్పలు పెట్టేందుకు పక్కాగా ప్లాన్ చేసినట్లే కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News