: ముష్కరుల్లో ఓ మహిళ... ఇద్దరు హతం, మూడోవాడిని సజీవంగా పట్టేశారు!


అమెరికాలోని కాలిఫొర్నియాలో నిన్న రాత్రి మెరుపు దాడికి దిగిన ముష్కరుల్లో ఓ మహిళ కూడా ఉందట. కాలిఫోర్నియాలోని శాన్ బెర్నార్డినో సమీపంలోని సోషల్ సర్వీస్ సెంటర్ పై బుల్లెట్ల వర్షం కురిపించిన ముగ్గురు ముష్కరులు 14 మందిని పొట్టనబెట్టుకున్నారు. మరో 17 మందిని తీవ్ర గాయాలపాల్జేశారు. ఘటనపై సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన శాన్ బెర్నార్డో పోలీసులు ముష్కరులను వేటాడారు. దాదాపు నాలుగు గంటల పాటు సాగిన సోదాలు, ఫైరింగ్ లో ఇద్దరు ఉన్మాదులను మట్టుబెట్టారు. పోలీసుల తూటాలకు హతమైన ఇద్దరు ముష్కరుల్లో ఓ మహిళ కూడా ఉంది. ఇక మూడో ముష్కరుడిని పోలీసులు సజీవంగానే పట్టేశారు. మిలిటరీ ఆఫీసర్లలా వేషం వేసుకుని వచ్చిన ముష్కరులు కారు దిగీ దిగగానే చేతుల్లోని ఏకే 47 గన్లతో స్వైర విహారం చేశారు. ఆ తర్వాత పోలీసు వాహనాల రాకను గమనించి సమీపంలోని భవనాల్లో దాక్కున్నారు. వీరి కోసం గాలింపును ముమ్మరం చేసిన పోలీసులు గంటల వ్యవధిలోనే ముష్కరుల భరతం పట్టేశారు. సజీవంగా పట్టుబడ్డ ఉన్మాదిని ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News