: వేడుకగా ‘రావుల’ కుమారుడి పెళ్లి... చంద్రబాబుతో ‘మై హోం’ రామేశ్వరరావు ముచ్చట్లు!


టీ టీడీపీ సీనియర్ నేత, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి కుమారుడు ప్రపుల్లారెడ్డి వివాహం నిన్న రాత్రి ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా హైదరాబాదు వచ్చారు. సికింద్రాబాదు పరిధిలోని ఓ ఫంక్షన్ హాలులో జరిగిన ఈ పెళ్లికి హాజరైన చంద్రబాబు నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ పెళ్లి వేడుకకు టీటీపీకి చెందిన ఇరు రాష్ట్రాల నేతలతో పాటు కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలకు చెందిన నేతలు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఇదిలా ఉంటే, ఈ పెళ్లిలో ఓ అరుదైన కలయిక చోటుచేసుకుంది. టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు అత్యంత సన్నిహితుడిగా పేరుపడ్డ ‘మై హోం గ్రూపు’ అధినేత జూపల్లి రామేశ్వరరావు చంద్రబాబుతో మాట కలిపారు. కొద్ది నిమిషాల సేపు సాగిన వీరి సంభాషణ సందర్భంగా అక్కడే టీడీపీకి చెందిన ఇద్దరు, ముగ్గురు నేతలు కూడా ఉన్నారు. రామేశ్వరరావు మర్యాదపూర్వకంగానే చంద్రబాబును కలిశారని, ఇందులో ప్రత్యేకతేమీ లేదని ఆ తర్వాత టీ టీడీపీ నేతలు చెప్పారు. ఈ వేడుకకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా హాజరయ్యారు.

  • Loading...

More Telugu News