: ఏపీ మంత్రి బొజ్జలకు అనారోగ్యం... అపోలో ఆసుపత్రిలో చేరిక


టీడీపీ సీనియర్ నేత, ఏపీ అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాదు, జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అనారోగ్య కారణాలతో ఇటీవల ఆయన పెద్దగా బయటకు రావడం లేని విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరుకు చెందిన బొజ్జల జిల్లాలోని శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో మావోయిస్టులు అలిపిరి వద్ద జరిపిన దాడిలో చంద్రబాబుతో ప్రయాణిస్తున్న బొజ్జల కూడా గాయపడ్డ సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News