: భారత్ పై యుద్ధం చేస్తాం... ముస్లింలకు వ్యతిరేకంగా మోదీ చర్యలు: ఐఎస్ఐఎస్ ప్రకటన


ప్రపంచ దేశాలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు నిన్న మరో సంచలన ప్రకటన చేశారు. భారత్ పైనా యుద్ధం ప్రారంభిస్తామంటూ ఆ ఉగ్రవాద సంస్థ చేసిన ప్రకటన పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. రొటీన్ కు భిన్నంగా భారత్ లోని రాజకీయ పరిస్థితులను కూడా ఉగ్రవాదులు తమ హెచ్చరికల్లో ప్రస్తావించడం గమనార్హం. అంతేకాక ముస్లింలకు వ్యతిరేకంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ చర్యలు చేపడుతున్నారని, ముస్లింలపైకి ప్రజలను ఉసిగొల్పుతున్నారని కూడా ఐఎస్ ఆరోపించింది. ఈ మేరకు నిన్న తన అధికారిక పత్రికలో ఐఎస్ ఉగ్రవాదులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. భారత్ తో పాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్ తదితర దేశాలపైనా దాడులు మొదలుపెడతామంటూ ఉగ్రవాదులు ప్రకటించారు. ‘‘గోమాంసం తినే ముస్లింలను చంపే హిందువుల సంఖ్య భారత్ లో నానాటికీ పెరిగిపోతోంది. హిందూ సంస్థలకు ఆర్థికపరమైన అండ ఇస్తున్న కొన్ని సంస్థలు పెద్ద సంఖ్యలో ముస్లిం వ్యతిరేకతను పెంచి పోషిస్తున్నాయి. భవిష్యత్తులో ముస్లింలకు వ్యతిరేకంగా యుద్ధానికి సన్నాహాలు చేస్తున్నాయి’’ అని ఐఎస్ ఉగ్రవాదులు భారత్ లో జరుగుతున్న రాజకీయ, సామాజిక పరిణామాలను విశ్లేషించారు.

  • Loading...

More Telugu News