: కేంద్ర హోం మంత్రిపై మరో మంత్రి చురకలు
కేంద్ర బొగ్గుశాఖ మంత్రి శ్రీ ప్రకాష్ జైశ్వాల్ ఈ రోజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశంలో అత్యాచారాలను అరికట్టడం అన్నది హోంమంత్రి బాధ్యతా కాదా? అని ఆయన ప్రశ్నించారు. పోలీసులు చురుకుగా వ్యవహరించేలా చూడడం అన్నది హోంమంత్రి బాధ్యత అని మంత్రి చురకంటించారు. ఈ నెల 15న తూర్పు ఢిల్లీ గాంధీనగర్లో ఐదేళ్ల చిన్నారిపై ఇద్దరు కామాంధులు అత్యాచారానికి పాల్పడిన నేపథ్యంలో షిండే రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండు చేశారు. దీనిపై హోంమంత్రి మాట్లాడుతూ.. అత్యాచారాలనేవి ఒక్క ఢిల్లీ లోనే కాదు, దేశవ్యాప్తంగానూ జరుగుతున్నాయి కదా?' అంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోనే జైశ్వాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.