: జపాన్ తీరానికి కొట్టుకొచ్చిన పడవల్లో మృత దేహాలు !


జపాన్ దేశ సముద్ర తీరంలోకి కొట్టుకొస్తున్న చెక్క పడవల్లో మృతదేహాలుంటున్నాయి. సుమారు రెండు నెలలుగా ఇటువంటి అనుభవం జపాన్ కు ఎదురవుతోంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయన్నది తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటి వరకు జపాన్ సముద్ర తీరంలోకి 12 చెక్క పడవల్లో మృతదేహాలు కొట్టుకువచ్చాయి. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మొత్తం 22 మృతదేహాలను వాటి నుంచి వెలికి తీశారు. ఒక పడవలో లభించిన రెండు మృత దేహాలకు తలలు కూడా లేవు. మరో పడవలో మొత్తం 6 పుర్రెలు లభ్యమయ్యాయి. మొదటి పడవ అక్టోబర్లో సముద్రతీరంలోకి రాగా, నవంబర్, డిసెంబర్లో మరిన్ని వచ్చాయి. ఒక బోటుపై ఉత్తర కొరియా అక్షరాల్లో 'కొరియన్ పీపుల్స్ ఆర్మీ' అని రాసి ఉంది. మరో బోటులో చినిగిపోయి ఉన్న ఒక గుడ్డ ముక్క లభించింది. ఈ బోట్లన్ని ఉత్తర కొరియా నుంచి వచ్చినట్టు జపాన్ అధికారులు భావిస్తున్నారు. ఈ బోట్లలో ఉన్న వారంతా ఎలా మరణించారనే విషయమై జపాన్ కోస్ట్ గార్డు అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News