: తమిళనాడును అన్ని విధాలా ఆదుకుంటాం: సీఎం కేసీఆర్
జలదిగ్బంధంలో ఉన్న తమిళనాడు రాష్ట్రానికి అన్ని విధాలా తమ సాయమందిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తన ఆదేశాల మేరకు తమిళనాడు సీఎస్ జ్ఞాన్దేశికన్తో తెలంగాణ రాష్ట్ర సీఎస్ రాజీవ్ శర్మ మాట్లాడారన్నారు. అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు. తమిళనాడులో భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోవడంపై కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిరాశ్రయులైన బాధితులకు సాయమందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.