: చెన్నై వీధుల్లో మొసళ్లు... భయాందోళనల్లో ప్రజలు!


జలమయమైన చెన్నై వీధుల్లో మొసళ్లు సంచరిస్తున్నాయి. చెన్నై క్రొకడైల్ పార్క్ నుంచి సుమారు 30 మొసళ్లు తప్పించుకున్నాయి. ఇవన్నీ జలమయమైన చెన్నై వీధుల్లోకి చేరినట్లు సమాచారం. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అయితే, ఈ సమాచారం తెలుసుకున్న క్రొకడైల్ పార్క్ అధికారులు రంగంలోకి దిగారు. వాటిని పట్టుకునేందుకు అవసరమైన సామగ్రితో వాళ్లు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. కాగా, గత పది రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చెన్నై మహా నగరంలోని పలు ప్రాంతాలు వరద నీటితో నిండిపోయాయి. చెరువులను తలపించేలా ఉన్న చెన్నై వీధుల్లో తప్పించుకున్న మొసళ్లు సంచరిస్తున్నాయన్న వార్తలతో ప్రజలు మరింత భయాందోళనలకు గురవుతున్నారు.

  • Loading...

More Telugu News