: చెన్నై వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించండి: కనిమొళి
చెన్నై వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని డీఎంకే ఎంపీ కనిమొళి కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారు. చైన్నై పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. విపత్కర పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ, సహకారాలు చాలా గొప్పవని... కానీ, ఇంకా ఎక్కువ సాయం అందజేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. గత వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా భారీగా కురుస్తున్న వర్షాలతో చైన్నైతో పాటు తిరువళ్లూర్, కాంచీపురం, కడలూర్ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఇప్పటి వరకు 188 మంది ప్రాణాలు కోల్పోయారు.