: తమిళనాడుకు జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, వరుణ్ తేజ్ ఆర్థిక సాయం
తమిళనాడు వరద బాధితుల సహాయార్థం పలువురు సినీ నటులు ఆర్థిక సాయం ప్రకటిస్తున్నారు. ఈ మేరకు నటుడు జూనియర్ ఎన్టీఆర్ రూ.10 లక్షలు, కల్యాణ్ రామ్ రూ.5 లక్షలు, వరుణ్ తేజ్ రూ.3 లక్షలు, '3జీ లవ్' చిత్ర నిర్మాత ప్రతాప్ కొలగట్ల రూ.లక్ష విరాళం ప్రకటించారు. మరోవైపు కర్ణాటక ప్రభుత్వం రూ.5 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత సహాయనిధికి తమ విరాళాలు ఇవ్వనున్నట్టు తెలిపారు.