: తమిళనాడుకు బీఎస్ఎన్ ఎల్ ఉచిత సేవలు
కుండపోత వర్షాలతో జలదిగ్బంధమైన తమిళనాడు రాష్ట్రానికి పలు టెలికాం సంస్థలు ఉచిత సదుపాయాలు కల్పించేందుకు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే ఎయిర్ టెల్ రూ.30ల ఉచిత టాక్ టైం ప్రకటిస్తే, తాజాగా ప్రభుత్వ సంస్థ బీఎస్ఎన్ ఎల్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. వారం రోజుల పాటు పూర్తి ఉచిత సేవలు అందించనున్నట్టు తెలిపింది. ఏడు రోజుల పాటు ఏ ఫోన్ కాల్స్ చేసుకున్నా, మెసేజ్ పంపినా ఉచితమేనని కేంద్ర టెలికాం శాఖ తెలిపింది.