: అమృత్ పథకం అమలుకు రాష్ట్రాలకు తొలి విడత నిధులు మంజూరు
అమృత్ పథకం అమలుకు తొలి విడతగా కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నిధులు విడుదల చేసింది. 13 రాష్ట్రాలకు గాను రూ.1,062.27 కోట్లను మంజూరు చేసింది. వాటిలో ఆంధ్రప్రదేశ్ కు రూ.60.08 కోట్లు, తెలంగాణకు రూ.40.85 కోట్ల నిధులు కేటాయించింది. ఈ పథకం కింద 500 పట్టణాలను అభివృద్ధి చేయనున్నారు. మౌలిక సదుపాయాల కల్పన, తాగునీటి సదుపాయం, మురుగు కాల్వల నిర్వహణ, రవాణా, మొక్కల పెంపకం, పార్కుల అభివృద్ధి వంటి వాటికి అమృత్ పథకం కింద కేంద్రం సహాయం చేస్తుంది.