: నేను హెచ్ఐవీ పాజిటివ్ పేషెంటుని: రష్యా న్యూస్ రీడర్ సంచలన ప్రకటన


తనకు హెచ్ఐవీ పాజిటివ్ ఉందంటూ రష్యా దేశానికి చెందిన ఒక న్యూస్ రీడర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అది కూడా, తాను పనిచేస్తున్న ఛానల్ లో ఒక కార్యక్రమం జరుగుతుండగా ఈ ప్రకటన చేశాడు. డాజ్జ్డ్ అనే స్వతంత్ర టీవీ స్టేషన్ లో లోబ్ కోవ్ (48) పనిచేస్తాడు. డిసెంబర్ 1న వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా టీవీలో ఒక కార్యక్రమం జరుగుతుండగా ఈ వ్యాఖ్యలు చేశాడు. కాగా, లోబ్ కోవ్ తన కున్న వ్యాధి గురించి బహిరంగంగా చెప్పడంతో రష్య న్ ప్రజలు, సామాజిక మాధ్యమాల ద్వారా నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. తనకు మద్దతుగా నిలిచిన వారికి ఈ సందర్భంగా లోబ్ కోవ్ థ్యాంక్స్ చెప్పారు. 2003లో తనకు ఈ వ్యాధి వచ్చిందని, తన మెడికల్ ఫైల్ పై ‘హెచ్ ఐవీ +’ అని నాడు డాక్టర్ రాసిన విషయాన్ని లోబ్ కోవ్ ప్రస్తావించారు. తన క్లినిక్ లో ఎక్కువ కాలం ట్రీట్ మెంట్ ఇవ్వడం వీలుపడదని డాక్టర్ చెప్పినప్పుడు, తనకు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన వచ్చిందన్నారు. కట్ చేస్తే... ఈ రోజున తాను ఒక మంచి పొజిషన్ లో ఉన్నానని లోబ్ కోవ్ పేర్కొన్నారు. ప్రజాదరణ పొందిన ఒక రష్యన్ తనకు హెచ్ఐవీ+ ఉందంటూ ఈ విధంగా బయటపెట్టడం ఇదే ప్రథమం.

  • Loading...

More Telugu News