: రైతుల కష్టానికి తగ్గ ఫలితం దక్కడం లేదు: కేంద్ర మంత్రి సంతోష్ కుమార్
దేశంలో రైతుల శ్రమకు తగ్గ ఫలితం దక్కడం లేదని కేంద్ర జౌళి శాఖ మంత్రి సంతోష్ కుమార్ అన్నారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఢిల్లీలో బుధవారం నాడు ఆయన్ని కలిశారు. తెలంగాణ పత్తి రైతుల సమస్యలపై సుదీర్ఘ చర్చ జరిపారు. ఈ చర్చల అనంతరం సంతోష్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణలో పత్తి రైతుల సమస్యలు నిజమేనని, పత్తి ధర నిర్ణయం విషయంలో తమ పాత్ర తక్కువగానే ఉందని అన్నారు. పత్తిలో తేమ అంశాన్ని పరిశీలిస్తామని, జౌళి శాఖ అదనపు కార్యదర్శి రెండు రోజుల్లో తెలంగాణలో పర్యటిస్తారని సంతోష్ కుమార్ వెల్లడించారు.