: మోకాళ్ల లోతు నీటిలోనే పూజా కార్యక్రమాలు!
చిత్తూరు జిల్లా నాగలాపురం మండలంలోని వేదనారాయణ స్వామి ఆలయ ప్రాంగణం వరద నీటితో నిండిపోయింది. మోకాళ్ల లోతు నీళ్లు అక్కడ చేరడంతో ఆలయ ప్రాంగణం చెరువును తలపిస్తోంది. అయితే, స్వామి వారికి నిర్వహించే నిత్య పూజలను మాత్రం యథావిధిగా ఆలయ అర్చకులు నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రాంగణం చాలా పెద్దగా ఉండటంతో, వరదనీరు ఎక్కువగా వచ్చి చేరింది. మోకాలు లోతు వరద నీటిలోనే ఆలయ అర్చకులు నడుచుకుంటూ గర్భగుడికి వెళుతున్నారు. ఈ ఆలయం ప్రస్తుతం టీటీడీ పర్యవేక్షణలో ఉంది.