: మెదక్ జిల్లాకు సింగూరు నీరు ఇవ్వకుంటే హరీష్ ను అడుగుపెట్టనివ్వం: జగ్గారెడ్డి
తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావుకు కాంగ్రెస్ నేత జయప్రకాష్ రెడ్డి (జగ్గారెడ్డి) హెచ్చరిక చేశారు. మెదక్ జిల్లాకు సింగూరు జలాలు ఇస్తామని గతంలో ఆయన మాట ఇచ్చారని, ఇప్పుడు దాన్ని నిలబెట్టుకోవాలని అన్నారు. సింగూరు నీరు ఇవ్వకపోతే హరీశ్ ను జిల్లాలో అడుగుపెట్టనీయమని స్పష్టం చేశారు. అలాగే ప్రస్తుతం జరగబోతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోబోదని, మెదక్ జిల్లాలో ఒంటరిగానే పోటీ చేస్తామని జగ్గారెడ్డి చెప్పారు.