: భారీ వర్షాల కారణంగా పలు రైళ్ల దారి మళ్లింపు


తమిళనాడు రాష్ట్రం సహా ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై-గూడూరు మధ్య రైల్వే వంతెనలపై వరదనీరు ప్రవహిస్తోంది. దీంతో ఈ రోజు నడవాల్సిన పలు రైళ్లను దారి మళ్లించారు. ఈ విషయాన్ని రైల్వే అధికారులు వెల్లడించారు. తిరువనంత పురం-గౌహతి ఎక్స్ ప్రెస్ ను మేల్ పాక్కం, తిరుత్తణి, రేణిగుంట, గూడురు మీదుగా; ముంబయి సీఎస్టీ - నాగర్ కోయిల్ ఎక్స్ ప్రెస్ ను మేల్ పాక్కం, తిరుత్తణి, కాట్పడి, విల్లుపురం మీదుగా; కాచిగూడ- చెన్నై ఎగ్మోర్ ఎక్స్ ప్రెస్ ను తిరుత్తణి వరకు పరిమితం చేశారు. కాగా, ఈరోజు నడవాల్సిన చెన్నై సెంట్రల్ -సాయినగర్ షిర్డీ ఎక్స్ ప్రెస్ ను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. కాగా, ప్రయాణికుల కోసం హెల్ప్ లైన్ నంబర్లను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసింది. చెన్నై సెంట్రల్ 044-25330714, చెన్నై ఎగ్మోర్ 044-28190216. చెన్నై కంట్రోల్ రూమ్ నంబర్లు... 044-29015204, 029015208గా అధికారులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News