: చెన్నై ఎయిర్ పోర్టులో చిక్కుకుపోయిన 700 మంది ప్రయాణికులు
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చెన్నై సంద్రంలా మారింది. చెన్నై విమానాశ్రయం నీట మునిగింది. విమానాశ్రయంలో పలు విమానాలు నిలిచిపోయాయి. దీంతోపాటు, 700 మంది ప్రయాణికులు ఎయిర్ పోర్టులో చిక్కుకుపోయారు. ఈ విషయాన్ని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మహేష్ శర్మ వెల్లడించారు. ప్రయాణికులందరికీ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని... వీలైనంత త్వరగా వీరిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని తెలిపారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ, వర్షాలు ఇంకా పడే పరిస్థితి ఉండటంతో... ఇప్పుడిప్పుడే చెన్నై నుంచి విమానాలు నడిపే పరిస్థితి లేదని చెప్పారు.