: చెన్నైలో భారీ వర్షాల కారణంగా నిలిచిపోయిన 'ది హిందూ' పత్రిక ప్రచురణ


చెన్నైలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రముఖ ఆంగ్ల దినపత్రిక 'ది హిందూ' ప్రింట్ ఎడిషన్ ప్రచురణ నిలిచిపోయింది. చెన్నైలోని మౌంట్ రోడ్డులో హిందూ ప్రధాన కార్యాలయంలో జరగాల్సిన సిటీ ఎడిషన్ ముద్రణను నిలిపివేశారు. ఈ విషయాన్ని హిందూ వెబ్ సైట్ లో తెలిపారు. తమిళనాడులోని చెన్నై, వెల్లూరు, పుదుచ్చేరితో పాటు ఏపీలోని తిరుపతి ప్రాంతాలకు పంపించే ఎడిషన్ ప్రింటింగ్ కూడా నిలిపివేసినట్టు 'హిందూ' వెల్లడించింది. వర్షాల నేపథ్యంలో పత్రిక పంపిణీ చేయడం సాధ్యపడక పోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అయితే పత్రిక పీడీఎఫ్ ను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసినట్టు పేర్కొంది.

  • Loading...

More Telugu News