: వరుణ్ సందేశ్ కి డెంగ్యూ అంటూ పుకార్లు... ఖండించిన యువ హీరో!


కొద్ది రోజుల్లో తన ప్రియురాలు వితికతో నిశ్చితార్థం జరుపుకోబోతున్న యువ హీరో వరుణ్ సందేశ్ కు కొత్త ఇబ్బంది వచ్చిపడింది. వరుణ్ కు డెంగ్యూ సోకిందంటూ పుకార్లు వెల్లువెత్తాయి. ఆ వివరాల్లోకి వెళ్తే, జనరల్ చెకప్ కోసం వరుణ్ సందేశ్ నిన్న హైదరాబాదు, సోమాజిగూడలోని యశోదా హాస్పిటల్ కు వెళ్లాడు. ఆసుపత్రిలో వరుణ్ ని చూసిన కొందరు ఈ విధమైన రూమర్లను క్రియేట్ చేశారట. వరుణ్ కి డెంగ్యూ సోకిందని, అందుకే హాస్పిటల్ కి వచ్చాడని ప్రచారం చేశారు. దీంతో, షాక్ కు గురైన వరుణ్, వెంటనే అలర్ట్ అయ్యాడు. తనకు ఎలాంటి ఆనారోగ్య సమస్య లేదని తెలిపాడు. కేవలం జనరల్ చెకప్ కోసమే హాస్పిటల్ కు వెళ్లానని చెప్పాడు. దీంతో, పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.

  • Loading...

More Telugu News