: బీహార్ అసెంబ్లీ స్పీకర్ పోస్టు జేడీయూదే!... ఏకగ్రీవంగా ఎన్నికైన విజయ్ చౌదరి


బీహార్ అసెంబ్లీ స్పీకర్ గా జేడీయూ సీనియర్ నేత, ఆ పార్టీ ఎమ్మెల్యే విజయ్ చౌదరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నేటి ఉదయం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా స్పీకర్ గా విజయ్ చౌదరి ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ సదానంద సింగ్ ప్రకటించారు. సమస్తిపూర్ జిల్లాలోని సరాయిరంజన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన చౌదరి గతంలో మంత్రిగానూ పనిచేశారు. స్పీకర్ గా ఎన్నికైన చౌదరిని సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, ప్రతిపక్ష నేత ప్రేమ్ కుమార్ అభినందించారు.

  • Loading...

More Telugu News