: చింటూకు ఆశ్రయం ఇచ్చిన అడ్వొకేట్ ను అరెస్ట్ చేసిన పోలీసులు
చిత్తూరు మేయర్ కఠారి అనురాధ, ఆమె భర్త మోహన్ ల హత్య కేసులో కీలక నిందితుడు చింటూకు ఆశ్రయం కల్పించాడన్న కారణంతో అడ్వొకేట్ ఆనంద్ ను చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. చింటూ కోసం ఓ వైపు పోలీసులు గాలిస్తుంటే... మరోవైపు అతనికి ఆనంద్ షెల్టర్ ఇచ్చాడు. ఆ తర్వాత చిత్తూరు జిల్లా కోర్టులో చింటూ లొంగిపోయాడు. ప్రస్తుతం చింటూను చిత్తూరులోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసులో ఇతర నిందితులైన వెంకటేష్, మొగిలి ఎక్కడ ఉన్నారనే విషయంపై కూడా పోలీసులు కూపీ లాగుతున్నారు.