: పెషావర్ పాఠశాలపై దాడి కేసులో నలుగురికి ఉరిశిక్ష అమలు
పాకిస్థాన్ లోని పెషావర్ సైనిక పాఠశాలపై జరిగిన కాల్పుల కేసులో నలుగురు ఉగ్రవాదులకు ఉరిశిక్ష అమలైంది. కోహట్ జైలులో మౌల్వీ అబ్దస్ సలాం, హజరత్ అలీ, ముజ్బీర్ రెహ్మాన్, సబేల్ లను ఉరితీసినట్టు కోహట్ పోలీసు అధికారులు వెల్లడించారు. 2014, డిసెంబర్ 16న పెషావర్ లోని పాఠశాలపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరపగా, 150 మంది విద్యార్థులు చనిపోయారు. పలువురికి గాయాలయ్యాయి. ఈ కేసులో ఆ దేశ మిలటరీ కోర్టు పై నలుగురికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.