: గుర్రంకొండ కోటలో కుంగిన భూమి... బయటపడ్డ సొరంగం
చిత్తూరు జిల్లా గుర్రంకొండలో ఉన్న చారిత్రాత్మక కోటలో ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల... కోటలోని ఒక ప్రాంతంలో ఈ రోజు భూమి కుంగిపోయింది. 30 అడుగుల లోతు, 10 అడుగుల వెడల్పుతో పెద్ద గుంత ఏర్పడింది. అయితే, ఆశ్చర్యకరంగా భూమి కుంగిన ప్రాంతంలో ఓ సొరంగ మార్గం వెలుగు చూసింది. సొరంగం వల్లే భూమి కుంగి పోయిందని స్థానికులు అంటున్నారు. మరోవైపు, ఈ విషయంపై పురాతత్వ శాఖకు సమాచారాన్ని అందించారు.