: బీబీసీ ఆపీస్ వద్ద బాంబు?... కలకలం రేపిన గుర్తు తెలియని వాహనం


విశ్వ విఖ్యాత వార్తా చానెల్ బీబీసీ ప్రధాన కార్యాలయం వద్ద బాంబు ఉందన్న వార్తలు లండన్ వాసులను తీవ్ర భయాందోళనలకు గురి చేశాయి. సెంట్రల్ లండన్ లోని బీబీసీ కార్యాలయం వద్ద గంటల తరబడి నిలిచిపోయిన ఓ వాహనం ఈ కలకలానికి కారణమైంది. అనుమానాస్పదంగా ఉన్న ఆ వాహనం గంటల తరబడి అక్కడే నిలిచి ఉన్న నేపథ్యంలో అందులో బాంబులు ఉన్నాయేమోనన్న అనుమానం బీబీసీ సిబ్బందిని వణికించింది. బీబీసీ సిబ్బంది నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెనువెంటనే రంగంలోకి దిగారు. బీసీసీతో పాటు దాని చుట్టుపక్కల ఉన్న కార్యాలయాలను అన్నింటినీ ఖాళీ చేయించారు. ఆ తర్వాత బాంబు స్క్వాడ్ ను రప్పించి సదరు వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయించారు. అయితే ఆ వాహనంలో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

  • Loading...

More Telugu News