: ఏపీ, చెన్నై వరద పరిస్థితిపై చర్చిద్దాం... లోక్ సభలో వెంకయ్యనాయుడు


ఆంధ్రప్రదేశ్, చెన్నైలో కురుస్తున్న భారీ వర్షాలతో ఏర్పడిన వరద పరిస్థితిపై చర్చ చేపడదామని లోక్ సభలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విపక్షాలను కోరారు. ఐదవరోజు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన వెంటనే సభలో వెంకయ్య మాట్లాడారు. 25 రోజులుగా చెన్నై నీటిలోనే ఉందని, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని, రైళ్లు రద్దవడంతో వేలాదిమంది ప్రయాణికులు అవస్థలు పడుతున్నారని సభకు తెలిపారు. సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపడుతున్నాయని వెంకయ్య వివరించారు. మరోవైపు వాయిదా తీర్మానాలపై చర్చించాలని విపక్ష సభ్యులు పట్టుబట్టగా... స్పీకర్ తిరస్కరించి ప్రశ్నోత్తరాలు మొదలుపెట్టారు.

  • Loading...

More Telugu News