: చేసిన తప్పును ఎత్తి చూపడానికే కాంగ్రెస్ తరపున పోటీ చేశాం: ఆనం


ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశీస్సులతో తాను, తన సోదరుడు వివేకా టీడీపీలో చేరామని ఆనం రాంనారాయణ రెడ్డి తెలిపారు. 2014లో ఏపీని విడగొట్టాలని కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంతో... ఏపీకి రాజధాని కూడా లేకుండా పోయిందని... ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చొని పనిచేయాలో తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో తాము కాంగ్రెస్ తరఫున పోటీ చేయడానికి కారణం ఉందని... రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు లేరని చెప్పారు. ఎన్నికల్లో కాంగ్రెస్ కు డిపాజిట్లు కూడా దక్కవని అధిష్ఠానానికి కూడా చెప్పామని తెలిపారు. కాంగ్రెస్ చేసిన తప్పును ఎత్తి చూపడానికే ఆ పార్టీ తరపున పోటీ చేశామని చెప్పారు. ఏపీ ప్రస్తుతం అనేక సమస్యలతో ఉందని... అయినా చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని అన్నారు. నెల్లూరు జిల్లాలోని టీడీపీ నాయకులందరితో కలసి పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తామని తెలిపారు. అధికారం, పదవుల కోసం టీడీపీలో చేరలేదని చెప్పారు.

  • Loading...

More Telugu News