: రాజీవ్ గాంధీ హంతకుల భవితవ్యం తేలేది నేడే... తుది తీర్పు వెలువరించనున్న సుప్రీంకోర్టు


మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకుల భవితవ్యానికి సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నేడు తుది తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో ఉరిశిక్ష పడిన రాజీవ్ హంతకులు మురుగన్, పెరారివలన్, శంతనులకు ఖరారైన ఉరిశిక్షను సుప్రీంకోర్టు జీవిత ఖైదుగా మార్చిన సంగతి తెలిసిందే. దాదాపు 11 ఏళ్ల పాటు రాష్ట్రపతి నిలయంలో దోషుల క్షమాభిక్ష పిటిషన్లు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలోనే గతేడాది సుప్రీంకోర్టు ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే దోషుల శిక్షా కాలాన్ని తగ్గించడంతో పాటు వారిని విడుదల చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం యత్నించింది. అయితే, ఈ యత్నాన్ని నిలిపేసిన సుప్రీంకోర్టు మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణను చేపట్టింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్.దత్తు నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ వ్యవహారంపై నేడు తుది తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో రాజీవ్ హంతకులు విడుదలవుతారా? లేక ఇంకా జైలులోనే మగ్గాల్సి వస్తుందా? అన్న చర్చకు తెరలేచింది.

  • Loading...

More Telugu News