: చెన్నై ఎయిర్ పోర్ట్ మూసివేత... 'రన్ వే'పైకి చేరిన వరద నీరు


చెన్నైపై వరుణుడి ముప్పేట దాడి కొనసాగుతోంది. ఇప్పటికే 10 రోజుల క్రితం ఎడతెరిపిలేని వర్షాల కారణంగా చెన్నై సహా తమిళనాడులోని వివిధ జిల్లాల్లో వంద మందికి పైగా మృత్యువాతపడ్డారు. తాజాగా రెండు రోజులుగా కురుస్తున్న వర్షం చెన్నై నగరాన్ని జలసంద్రంగా మార్చేసింది. నగరంలోని మెజారిటీ కాలనీలు నీట మునిగాయి. నిన్న ఉదయం నుంచి రాత్రి దాకా క్షణం తెరిపి ఇవ్వకుండా కురిసిన వర్షం కారణంగా చెన్నై ఎయిర్ పోర్టు మూతపడింది. ఎయిర్ పోర్ట్ రన్ వే పైకి వర్షపు నీరు చేరిపోయింది. అక్కడ నిలిచిన విమానాల అండర్ క్యారేజీలను తాకుతూ వరద నీరు ప్రవహిస్తోంది. మొత్తం రన్ వే నీటిలో మునిగిపోయింది. ఎయిర్ పోర్టులో 400 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. నిన్న రాత్రి 9 గంటల సమయానికి 9 విమాన సర్వీసులు రద్దయ్యాయి. రన్ వేపై చేరిన నీరంతా పూర్తిగా వెళ్లిపోయేదాకా విమాన సర్వీసులను పునరుద్ధరించలేమని ఎయిర్ పోర్టు డైరెక్టర్ దీపక్ శాస్త్రి చెప్పారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్ష సూచన నేపథ్యంలో ఎయిర్ పోర్టు ఎప్పటికి తెరచుకుంటుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇక పెద్ద సంఖ్యలో రైళ్లను కూడా అధికారులు రద్దు చేయాల్సి వచ్చింది.

  • Loading...

More Telugu News