: ఏపీలో 8 కార్పొరేషన్లకు చైర్మన్లు... ఉత్తర్వులు జారీ చేసిన చంద్రబాబు సర్కారు
ఏపీలో ఎట్టకేలకు నామినేటెడ్ పోస్టుల భర్తీకి తొలి అడుగు పడింది. రాష్ట్రంలోని 8 కీలక కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ నిన్న రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తొలి విడతలో 8 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించిన చంద్రబాబు, మలి విడతలో మరిన్ని కార్పొరేషన్ల ఖాళీలను భర్తి చేయనున్నట్లు సమాచారం. మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలైన పార్టీ కీలక నేతలకు, కొత్త సమీకరణాల వల్ల సీట్లను త్యాగం చేసిన నేతలకు తొలి విడతలో ప్రాధాన్యం లభించినట్లు తెలుస్తోంది. అంతేకాక భర్తీ అయిన 8 కార్పొరేషన్లలో ఐదింటిని కోస్తాంధ్రకు చెందిన నేతలకు కేటాయించిన చంద్రబాబు, మూడింటిని రాయలసీమ నేతలతో భర్తీ చేశారు. భర్తీ అయిన 8 కార్పొరేషన్ చైర్మన్ల వివరాలిలా ఉన్నాయి... స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ... జయరాంరెడ్డి హౌసింగ్ కార్పొరేషన్ ... వర్ల రామయ్య సివిల్ సప్లై కార్పొరేషన్... మల్లెల లింగారెడ్డి ఎస్సీ కార్పొరేషన్.... జూపూడి ప్రభాకర్ రావు మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్.. పంచుమర్తి అనురాధ బీసీ కార్పొరేషన్ ..... బి.రంగనాయకులు కాపు కార్పొరేషన్.... చలమలశెట్టి రామాంజనేయులు వేర్ హౌసింగ్ కార్పొరేషన్... ఎల్వీఎస్సార్కే ప్రసాద్