: నాగ్ పూర్ పిచ్ కు ఎల్లో కార్డు... జరిమానా దిశగా ఐసీసీ అడుగులు


ఐదు రోజుల టెస్టు మ్యాచ్ మూడంటే మూడు రోజుల్లో ముగిసిపోయింది. ఆట ఆరంభం నుంచి విజయం ఓ వైపే మొగ్గింది. ఇరు జట్లలోని స్పిన్నర్లు బంతిని గింగిరాలు తిప్పారు. పరుగులు రాబట్టేందుకు బ్యాట్స్ మెన్ నానా తంటాలు పడ్డారు. మూడు రోజుల వ్యవధిలోనే ఇరు జట్లు రెండు సార్లు ఆలౌటయ్యాయి. వెరసి ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో టీమిండియా సఫారీలపై రికార్డు విజయాన్ని నమోదు చేసింది. ఇదంతా ఎక్కడ జరిగిందో తెలుసుగా, మహారాష్ట్ర నగరం, బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ సొంతూరు నాగ్ పూర్ లోనని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఈ మ్యాచ్ పై ఒక్క భారత్, దక్షిణాఫ్రికాల్లో మాత్రమే కాక విశ్వవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ పెద్ద చర్చే నడుస్తోంది. పిచ్ ను స్పిన్ కు అనుకూలంగా సిద్ధం చేయడంతోనే ఇదంతా జరిగిందని కూడా దాదాపుగా అందరూ ఓ నిర్ధారణకు వచ్చేశారు. కాస్త ఆలస్యంగా మేల్కొన్న ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నాగ్ పూర్ పిచ్ పై కొరడా ఝుళిపించింది. పిచ్ కు ఎల్లో కార్డు జారీ చేసిన ఐసీసీ రిఫరీ జెఫ్ క్రౌ దీనిపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. విచారణలో భాగంగా పిచ్ పనితీరు పేలవంగా ఉందని తేలితే భారీ జరిమానా విధించేందుకు కూడా ఐసీసీ రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News