: సీఆర్డీఏ అధికారులతో చంద్రబాబు భేటీ... రాజధాని నిర్మాణాలపైనే ప్రధాన చర్చ


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో చేపట్టాల్సిన నిర్మాణాలపై దృష్టి సారించారు. ఇప్పటికే శంకుస్థాపన కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసిన ఆయన రాజధాని బ్లూ ప్రింట్ పై విడతల వారీగా ఇటు అధికారులతోనే కాక, అటు విదేశీ ప్రతినిధులతోనూ వరుస భేటీలు నిర్వహించారు. తాజాగా విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు సీఆర్డీఏ అధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అమరావతిలో తొలి విడతగా చేపట్టాల్సిన నిర్మాణాలపైనే ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ నిర్మాణాలకు సంబంధించి పలుమార్లు అధికారులకు దిశానిర్దేశం చేసిన చంద్రబాబు, ఈ భేటీలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News