: చెన్నైని ముంచెత్తిన వాన... రోడ్లపై ఆరడుగుల వరద నీరు, ఇళ్లపైకి చేరిన నగర వాసులు


చెన్నైని వరుణ దేవుడు ఇప్పుడప్పుడే కరుణించేలా లేడు. వారం క్రితం చెన్నైతో పాటు తమిళనాడులోని పలు జిల్లాల్లో రోజుల తరబడి కురిసిన వర్షం పెను బీభత్సం సృష్టించింది. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి కారణంగా నేటి ఉదయం నుంచి చెన్నైలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో నగరంలోని మెజారిటీ కాలనీలన్నీ నీట మునిగాయి. ప్రధాన రోడ్లపై దాదాపు ఆరడుగుల వరద నీరు పారుతోంది. పెద్ద సంఖ్యలో వాహనాలు కొట్టుకుపోయాయి. కాలనీల్లో వరద నీరు చేరిన నేపథ్యంలో నడిసంద్రంలో చిక్కుకున్న వారిలా నగరవాసులు తమ ఇళ్లపైకి చేరుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. చెన్నైతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.

  • Loading...

More Telugu News