: టీమిండియా వరల్డ్ కప్ విన్నర్స్ కు ‘కేజ్రీ’ సన్మానం... ‘ఫిరోజ్ షా కోట్ల’ వేదిక


ఫ్రీడమ్ సిరీస్ లో భాగంగా ఢిల్లీ వేదికగా జరగనున్న నాలుగో టెస్టులో అరుదైన ఘట్టం నమోదు కానుంది. ఈ నెల 3న ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు జరగనుంది. ఫ్రీడమ్ సిరీస్ లో భాగంగా ఇదే చివరి మ్యాచ్. ఈ మ్యాచ్ కు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నాడు. ఈ మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర అంకానికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదించారు. భారత్ కు ప్రపంచ కప్ ను సాధించిపెట్టిన క్రికెటర్లను ఘనంగా సన్మానించాలన్న ఆయన ప్రతిపాదనకు బీసీసీఐ సానుకూలంగా స్పందించింది. దీంతో ఈ నెల 3న టెస్టు మ్యాచ్ సందర్భంగా ఏర్పాటు కానున్న ప్రత్యేక కార్యక్రమంలో 1983, 2011 వరల్డ్ కప్ హీరోలు ‘కపిల్ డెవిల్స్’ జట్టు సభ్యులు, ‘ధోనీ సేన’ జట్టు సభ్యులను ఢిల్లీ ప్రభుత్వం ఘనంగా సన్మానించనుంది. ఈ వేడుకకు రావాలని ఇప్పటికే ఢిల్లీ సర్కారు ఇరు జట్ల ఆటగాళ్లకు ఆహ్వానాలను కూడా పంపింది.

  • Loading...

More Telugu News