: అప్పుడూ, ఇప్పుడూ ఒకటే మాట: బొత్స


రాష్ట్ర రాజకీయాల్లో సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స భిన్న ధ్రువాల్లాంటివారని తెలిసిందే. ఆయన ఎడ్డెమంటే, ఈయన తెడ్డమంటారు. రోజూ వార్తల్లో నలుగుతున్న బయ్యారం ఉక్కు కర్మాగారం విషయంలోనూ వీరి వైఖరి స్పష్టమైంది. రెండ్రోజుల క్రితం బయ్యారంలో స్టీల్ ప్లాంట్ నిర్మిస్తామని ముఖ్యమంత్రి అంటే.. బొత్స అక్కడ కర్మాగారం ఏర్పాటు కష్టమే అని వ్యాఖ్యానించారు. నేడూ, బొత్స తన మాటకు కట్టుబడి ఉన్నానని చెబుతున్నారు. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ నెలకొల్పడం సాంకేతికంగా సాధ్యం కాదని మరోసారి చెప్పారు. పైపెచ్చు, రాష్ట్ర కాంగ్రెస్ విధానం ఇదేనన్నారు.

  • Loading...

More Telugu News