: కుమారుడి కంపెనీలలో ఐటీ, ఈడీ తనిఖీలను ఖండించిన చిదంబరం


తన కుమారుడు కార్తి చిదంబరం సంస్థలపై ఇవాళ ఐటీ, ఈడీ జరిపిన తనిఖీలపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం స్పందించారు. తనిఖీలను ఆయన తీవ్రంగా ఖండించారు. అవి ప్రభుత్వం చేపట్టిన మోసపూరిత తనిఖీలన్నారు. ఏదైనా ఉంటే తనను నేరుగా ప్రశ్నించాలని, అంతేగాని తన కుటుంబ సభ్యులను, సన్నిహితులను ఇబ్బంది పెట్టవద్దని కోరారు. ఇలాంటి రాజకీయాలతో ఏమీ సాధించలేరన్నారు. కేంద్ర ప్రభుత్వం తన కుటుంబంపై ప్రతీకార చర్యలకు పాల్పడుతోందని చెన్నైలో ఆరోపించారు.

  • Loading...

More Telugu News