: టీడీపీ జన చైతన్య యాత్రలో మంత్రి కొల్లును అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు
టీడీపీ ఈరోజు జన చైతన్య యాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే కృష్ణాజిల్లా, మచిలీపట్నం మండలం కర అగ్రహారంలో నిర్వహించిన ఈ చైతన్య యాత్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఏడాదిన్నర పాలనలో ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను మంత్రి కొల్లు రవీంద్ర వివరిస్తుండగా వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఇరు వర్గాల వారు కొట్టుకున్నారు. దాంతో రంగప్రవేశం చేసిన పోలీసులు అడ్డుకుని పరిస్థితి సద్దుమణిగేలా చేశారు. సీఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేకే వైసీపీ నేతలు అడ్డుపడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.