: సస్పెన్షన్ వేటు పడ్డ నరైన్ కు అండగా విండీస్ బోర్డు


వెస్టిండీస్ మ్యాజిక్ స్పిన్నర్ సునీల్ నరైన్ పై ఐసీసీ సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. బౌలింగ్ చేస్తున్నప్పుడు మోచేతిని 15 డిగ్రీల కంటే ఎక్కువగా వంచుతున్నాడని పరీక్షల్లో తేలడంతో నరైన్ పై వేటు పడింది. అయితే, నరైన్ కు కష్టకాలంలో అండగా ఉంటామని విండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ట్రినిడాడ్ దేశవాళీ క్రికెట్ లీగ్ ద్వారా నరైన్ తన బౌలింగ్ ను మెరుగు పరుచుకోవడానికి అవకాశం కల్పిస్తామని ఓ ప్రకటనలో బోర్డు తెలిపింది. ఇది నరైన్ అంతర్జాతీయ పునరాగమనానికి కచ్చితంగా ఉపయోగపడుతుందని బోర్డు ఆశాభావం వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News