: లండన్ కోర్టు తీర్పుతో ఊపిరి పీల్చుకున్న న్యూజిలాండ్ క్రికెట్ బోర్డ్
తమ మాజీ స్టార్ క్రికెటర్ క్రిస్ కెయిన్స్ పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డ్ ప్రకంపనలకు లోనయింది. అయితే, ఈ ఆరోపణల్లో వాస్తవం లేదని లండన్ కోర్టు తేల్చి చెప్పడంతో ఊపిరి పీల్చుకుంది. ఈ సందర్భంగా న్యూజిలాండ్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ స్టువర్ట్ హీల్ మాట్లాడుతూ, కోర్టు తీర్పు చాలా ఆరోగ్యకరమైనదని చెప్పారు. ఒకవేళ ఈ తీర్పు రానట్టైతే, న్యూజిలాండ్ క్రికెట్ కు తీరని అన్యాయం జరిగి ఉండేదని అన్నారు. కోర్టు తీర్పుతో నిజాలు ప్రజలకు తెలిశాయని చెప్పారు. ఇండియన్ క్రికెట్ లీగ్ లో కెయిన్స్ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాడని ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ 2010లో ఓ ట్వీట్ ద్వారా కలకలం రేపారు. ఈ క్రమంలో, 2012లో కెయిన్స్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.