: గాంధీ దృష్టిలో స్వచ్ఛ భారత్ అంటే స్వచ్ఛమైన మనసు, వాతావరణం: ప్రణబ్ ముఖర్జీ


జాతిపిత మహాత్మా గాందీ ఉద్దేశంలో స్వచ్ఛ భారత్ అంటే కేవలం పరిశుభ్రమైన భారత్ మాత్రమే కాదని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. స్వచ్ఛమైన మనసు, వాతావరణం స్వచ్ఛ భారత్ అని చెప్పారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో సబర్మతీ ఆశ్రమంలో జరిగిన 62వ గుజరాత్ విద్యాపీట్ స్నాతకోత్సవంలో ప్రణబ్ పాల్గొన్నారు. ప్రజల్లో అసహనం గురించి మాట్లాడుతూ, దేశంలో నిజమైన చెత్త రోడ్లపై లేదని... ప్రజల మనసుల్లో ఉందని అన్నారు. సమాజాన్ని విభజించే భావజాలాన్ని మన మనసుల్లోంచి తీసివేసేందుకు ఇష్టపడకపోవడమే అందుకు నిదర్శనమన్నారు. దేశం సంఘటితంగా ఉండాలని గాంధీ కలలు కన్నారని ఈ సందర్భంగా చెప్పారు. ప్రజలంతా సమానమేనని, అనందంగా ఉండాలని, మనుషులపై ఒకరికొకరికి నమ్మకం ఉండాలని కోరారు. భారత్ అహింస అనే సూత్రం ఆధారంగా ఏర్పడిందన్న ప్రణబ్, ఈ వైవిధ్యాన్ని అందరూ అర్థం చేసుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News