: ప్రత్యేక హోదాపై ఏకాభిప్రాయం అవసరం లేదు: సుజనాచౌదరి


ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో అన్ని రాష్ట్రాల నుంచి అభిప్రాయం కావాలనడం సరికాదని కేంద్ర మంత్రి సుజనాచౌదరి అన్నారు. రాజ్యసభలో మంత్రి వెంకయ్యనాయుడు ఇలా మాట్లాడి ఉంటారని తాననుకోవట్లేదని చెప్పారు. పార్లమెంటులో చర్చించాకే విభజన బిల్లు ఆమోదం పొందిందని ఢిల్లీలో విలేకరుల సమావేశంలో గుర్తు చేశారు. కాబట్టి హోదాపై ఏకాభిప్రాయం అవసరం లేదని పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజీ ఏది ఇస్తారో స్పష్టత లేదని, కానీ రాష్ట్రానికి కేంద్రం నష్టం జరగకుండా చూస్తుందని విశ్వసిస్తున్నానని అన్నారు. ఇక జీఎస్టీ బిల్లుకు పూర్తి స్థాయి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News