: భోగాపురం విమానాశ్రయ నిర్మాణాన్ని అడ్డుకుంటాం: బృందా కారత్
విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణాన్ని అడ్డుకుంటామని.. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ధి చేకూర్చేలా ఎయిర్ పోర్ట్ ప్లానింగ్ ఉందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ అన్నారు. పార్లమెంటులో సైతం ఈ విషయాన్ని లేవనెత్తుతామని చెప్పారు. ఈ రోజు పార్టీకి చెందిన నేతలతో కలసి భోగాపురం విమానాశ్రయం ప్రాంతంలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. దేశంలోని ఇతర ఎయిర్ పోర్టుల్లో ఉద్యోగులను తొలగిస్తుంటే... భోగాపురం ఎయిర్ పోర్టుతో ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం చెబుతోందని విమర్శించారు.