: అన్నా హజారేని కలసిన ఆప్ నేతలు


గాంధేయవాది, సామాజిక కార్యకర్త అన్నాహజారేని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కుమార్ విశ్వాస్, సంజయ్ సింగ్ లు కలిశారు. ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ ప్రభుత్వం జనలోక్ పాల్ బిల్లు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బిల్లులోని ముఖ్యాంశాలను వారు హాజారేకు వివరించారు. దాంతో అవినీతిని సమర్థవంతంగా అరికడతామని పేర్కొన్నారు. ప్రస్తుతం అన్నా తన స్వగ్రామం మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా రాలేగావ్ సిద్ధిలో ఉన్నారు. అక్కడికే ఆప్ నేతలు వెళ్లి మరీ ఆయనను కలిశారు. ఈ విషయాన్నంతటినీ అన్నా అనుచరుడు దత్త అవారీ ధ్రవీకరించారు. జనలోక్ పాల్ బిల్లును ప్రవేశపెడతానని అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల సమయంలో ప్రజలకు హామీ ఇవ్వగా తాజాగా అమలుపరిచారు.

  • Loading...

More Telugu News