: ఇంగ్లీషు ఎలా మాట్లాడాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్న చైనా పైలట్లు


ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు... చైనా పౌర విమానయాన శాఖ తీసుకున్న నిర్ణయం ఆ దేశ పైలట్ల ప్రాణాల మీదకొచ్చింది. వివరాల్లోకి వెళ్తే, చైనాలో ఇంగ్లీషు వాడకం చాలా తక్కువన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో, 2017 నుంచి చైనా పైలట్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు కేవలం ఇంగ్లీషులోనే మాట్లాడుకోవాలంటూ చైనా పౌర విమానయాన సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో చైనా పైలట్లకు ఇంగ్లీషులో ఆరు నెలల పాటు శిక్షణ ఇచ్చారు. అయితే, ఇంగ్లీషు నేర్చుకోవడం వారికి తలకు మించిన భారంగా పరిణమించింది. ఎలా నేర్చుకోవాలో, ఎలా మాట్లాడాలో అర్థంకాక పైలట్లు తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం చైనాలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు విదేశీ పైలట్లకు ఇంగ్లీషులో సూచనలు ఇస్తుండగా, చైనా పైలట్లకు మాత్రం మాండరిన్ భాషలో చెబుతున్నారు.

  • Loading...

More Telugu News