: తొలి 'మేకిన్ తెలంగాణ' ట్యాబ్లెట్ పీసీ విడుదల


తొలి మేకిన్ తెలంగాణ ట్యాబ్లెట్ పీసీ విడుదలైంది. సెల్ కాన్ కంపెనీ తయారు చేసిన ఆ ట్యాబ్లెట్ పీసీని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈరోజు విడుదల చేశారు. తక్కువ సమయంలోనే సెల్ కాన్ కంపెనీ 10 లక్షల ఫోన్లను తయారు చేయడం అభినందనీయమని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. మొబైల్ రీసెర్చ్ యూనిట్ ను కూడా హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం సంతోషకరమన్న మంత్రి, రాష్ట్రంలో మొబైల్ హబ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే మైక్రోమ్యాక్స్, సెల్ కాన్ కంపెనీలు ప్లాంట్లను ఏర్పాటు చేశాయని గుర్తు చేశారు. త్వరలో హైదరాబాద్ లో రియల్ వ్యాపారం పెరగనుందని మంత్రి చెప్పారు.

  • Loading...

More Telugu News