: మిథున్ రెడ్డిపై కేసు వెనుక కుట్ర దాగుంది: వైకాపా


కడప జిల్లా రాజంపేట వైకాపా ఎంపీ మిథున్ రెడ్డిపై కేసు వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆ పార్టీ ఎమ్మెల్యేలు నారాయణస్వామి, కొరముట్ల శ్రీనివాసులు ఆరోపించారు. ఈ రోజు తిరుపతిలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, వారు ఈ వ్యాఖ్యలు చేశారు. దురుద్దేశపూర్వకంగానే ఈ కేసు పెట్టారని మండిపడ్డారు. ఒక ఎంపీ స్థాయి వ్యక్తికే రక్షణ లేకపోతే, సామాన్యుడి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ కలగజేసుకోవాలని... మిథున్ రెడ్డిపై పెట్టిన కేసును ఉపసంహరింపజేయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News