: అమెరికా నాన్ స్టాప్ ఫ్లైట్ లో టికెట్లన్నీ అమ్ముడైపోయాయి... రేపే తొలి ప్రయాణం


దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నింగికెగరనున్న ఎయిర్ ఇండియా విమానం నేరుగా సిలికాన్ వ్యాలీగా ప్రసిద్ధి చెందిన అమెరికా నగరం శాన్ ఫ్రాన్సిస్కోలో ల్యాండవుతుంది. అంటే, న్యూఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో దాకా నాన్ స్టాప్ జర్నీ అన్నమాట. ఈ తరహా విమాన ప్రయాణం ఇప్పటిదాకా అందుబాటులో లేదు. కొత్తగా ఈ సర్వీసును ఎయిర్ ఇండియా ప్రవేశపెట్టింది. ఈ సర్వీసు రేపటి నుంచి తన జర్నీని ప్రారంభించనుంది. ఈ తొలి జర్నీని ఆస్వాదించేందుకు విమాన ప్రయాణికులు ఆసక్తి కనబరిచారు. విమానంలో ఉన్న మొత్తం 238 సీట్లలో 98 శాతం సీట్లు ఇప్పటికే అమ్ముడుబోయాయట. దేశంలోని వివిధ నగరాలకు చెందిన వారు ఈ టికెట్లు కొనుగోలు చేశారు. ప్రధానంగా బెంగళూరు పరిసర ప్రాంతాల వారు ఈ టికెట్లలో మెజారిటీ వాటాను దక్కించుకున్నారు. వీరందరినీ నేటి సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీ తరలించి, అక్కడ ఎయిర్ ఇండియా నాన్ స్టాప్ విమానం ఎక్కిస్తారు. రేపు తెల్లవారుజామున ఢిల్లీ నుంచి ఈ నాన్ స్టాప్ ఫ్లైట్ టేకాఫ్ తీసుకుంటుంది.

  • Loading...

More Telugu News