: ఘజియాబాద్ పాఠశాలలోకి తుపాకులతో కిడ్నాపర్లు... ఉతికి ఆరేసిన పోలీసులు


ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ నగరంలో నేటి ఉదయం కలకలం రేగింది. తుపాకులు చేతబట్టిన ముగ్గురు కిడ్నాపర్లు అక్కడి ఓ పాఠశాలలోకి చొచ్చుకెళ్లారు. తుపాకులతో ఎంటరైన కిడ్నాపర్లను చూసి పిల్లలతో పాటు టీచర్లు కూడా బెంబేలెత్తిపోయారు. ఇవేమీ పట్టించుకోని సదరు కిడ్నాపర్లు తాము టార్గెట్ చేసిన బాలిక ఉన్న తరగతి గదిలోకి వెళ్లారు. గదిలోని మిగిలిన పిల్లలందరినీ బయటకు పంపేసిన కిడ్నాపర్లు బాలికను మాత్రం తమ అధీనంలోకి తీసుకున్నారు. తరగతి గది తలుపులు మూసేసుకున్న కిడ్నాపర్లు అక్కడి నుంచి బాలిక తండ్రికి ఫోన్ చేశారు. రూ.2 కోట్లిస్తేనే నీ కూతురును వదిలేస్తామని బెదిరించిన కిడ్నాపర్లు... లేనిపక్షంలో కాల్చి చంపేస్తామని హెచ్చరించారు. ఊహించని ఘటనతో తొలుత షాక్ తిన్న బాలిక తండ్రి ఆ తర్వాత వేగంగా స్పందించారు. వెనువెంటనే పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు అందిన వెంటనే రంగంలోకి దిగిపోయిన పోలీసులు పాఠశాలను రౌండప్ చేశారు. క్షణాల్లో లోపలకు చొచ్చుకు వెళ్లి, కిడ్నాపర్లు ఉన్న గది తలుపులను బద్దలు కొట్టారు. కిడ్నాపర్లు తేరుకునేలోగానే చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు వారి చేతుల్లోని తుపాకులు లాగేశారు. వెనువెంటనే కిడ్నాపర్ల చేతులకు బేడీలు వేశారు. ఆపై నాలుగు తగిలించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనలో బాలికకు చిన్నపాటి గాయం కూడా కాలేదు.

  • Loading...

More Telugu News